నిగమ కల్పతరోర్గళితం ఫలం శుకముఖా దమృత ద్రవసమ్మితమ్
।
పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువిభావుకాః ॥
అది సరస్వతీ నదీతీరం. వ్యాసముని చంద్రుని పవిత్ర ఆశ్రమం. అక్కడ జైమిని, పైల, సుమంత, వైశంపాయనాది శిష్యులు ధర్మశాస్త్ర మీమాంస చేస్తున్నారు. లోకోవృత్త సమీక్ష చేస్తున్నారు. సృష్టి, స్థితి లయాత్మకమయిన ఈ జగత్తు యొక్క లీలా విశేషాలు, పదార్థ పరమార్థతత్త్వ వివేచనాలు వారి గోష్ఠిలో సాగిపోతున్నాయి.
వారికి అక్షర భిక్ష పెట్టిన గురుదేవులు ఆచార్య వ్యాసులు మాత్రం అన్యమనస్కంగా ఉన్నారు. ప్రతిరోజు వారి చర్చలలో, వాగ్వాదాలలో పాల్గొని వారి బుద్ధికి అందని తాత్విక రహస్యాలు వివరించే ఆ మహర్షి యీనాడు చింతాక్రాంతులై ఉండడం ఆశ్చర్య వ్యధ కలిగించింది.
అయినా ఆయన ఏకాంత మౌన మహా సమాధిని భంగ పరచడం యిష్టం లేక శిష్యులు తమ చర్చలో నిమగ్నులయ్యారు.
అంతలో అక్కడకు దేవ ఋషి నారదుడు వచ్చాడు. వైశంపాయనాదులు ఆయనకు అర్ఘ్య పాద్యాలు ఇచ్చి ఉచితాసనంపై కూర్చోబెట్టారు.